మంత్రగత్తె నెపంతో రాళ్లతో కొట్టి చంపి…!

Attack on Mentally-challenged Woman
Attack on Mentally-challenged Woman
Share
Attack on Mentally-challenged Woman
Attack on Mentally-challenged Woman

ఆగ్రా : దేశంలో అరాచకాలు హద్దుమీరుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకున్నది. మానసిక రోగంతో బాధపడుతున్న 62 ఏళ్ళ వృద్ధురాలిని ‘మాంత్రికురాలు’ పేరుతో కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన ఆగ్రాలోని ఓ గ్రామంలో జరిగింది. మాన్‌దేవి అనే మహిళ మానసిక రోగంతో రాత్రుల పూట తిరుగుతోంది. ఆ విధంగా ఆమె సమీపంలోని ఓ కాలనీకి మంగళవారం చేరుకుంది. ఆమె అవతారం చూసిన గ్రామస్తులు ఆమె మాంత్రికురాలు అనే ముద్రవేసి దారుణంగా కొట్టి చంపారని బుధవారం పోలీసులు తెలిపారు. అప్పటికే ఆమె తెల్లచీర కట్టుకొని వుంది. దీంతో బయట పడుకున్న ఓ బాలిక దయ్యం దయ్యం అంటూ అరిచింది. స్థానికులు బయటకు వచ్చి ఆమె దయ్యం కాదని, మాంత్రికురాలు అంటూ ఆ వృద్ధురాలి జుట్టుపట్టుకొని నేలకేసి కొట్టి, రాళ్ళతో మోదారు. పోలీసులు రంగంలోకి దిగి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. ఆ తర్వాత ఆమె ఓ పిచ్చిది అని, గత కొంతకాలంగా ఇల్లు విడిచి అలా తిరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. మాన్‌దేవి బంధువులు ఆసుపత్రికి వచ్చేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*