షేక్‌ హ్యాండ్‌ ఇస్తే కేసు పెట్టేస్తారా? (వీడియో)

హైదరాబాద్‌ : ఎస్‌ఐకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినందుకే కేసు పెట్టిన ఘనత హైదరాబాద్‌ నగర పోలీసులకే చెల్లిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినందుకు సనత్‌నగర్‌ పోలీసులు తనపై కేసు పెట్టారని ఓ టీవీ యాంకర్‌ ఆవేదన వెలిబుచ్చారు. పైగా ఒక మైనర్‌ బాలుడిపైన, 75 ఏళ్ళ వృద్ధులపైన కూడా కేసులు బనాయించారని ఆ యాంకర్‌ తెలిపారు. తనను బెదిరిస్తూ దుర్భాషలాడుతున్నారని కూడా ఆరోపించారు. పోలీసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశానన్న కక్షతో తనపై ఇలా తప్పుడు కేసులు బనాయించారని, తన పిల్లల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నారని ఆ కన్నతల్లి ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే వుంటుందని కూడా వారు బెదిరిస్తున్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*