వేలంలో మాల్యా ఇల్లు సచిన్‌ కైవసం

Vijay Mallya
Vijay Mallya
Share
Vijay Mallya
Vijay Mallya

ముంబయి : బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు పెట్టి ఊళ్లు తిరుగుతున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ఒక ఇంటిని ఎట్టకేలకు వేలం వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారధ్యంలో అప్పులోళ్ళు గోవాలోని కింగ్‌ఫిషర్‌ విల్లాను అమ్మడంలో విజయవంతమయ్యారని ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ ఇంటిని 73 కోట్ల రూపాయలకు విక్రయించారు. గతంలో రూ. 85.29 కోట్లు, రూ. 81 కోట్లు విలువైన రెండు ఆస్తులను విక్రయించడంలో బ్యాంకు విఫలమైంది. అయితే ఈ కింగ్‌ఫిషర్‌ విల్లాను మాత్రం 73 కోట్ల రూపాయలకు వేలం వేసి అమ్మేశారు. ఈ డబ్బును అప్పులోళ్ళు పంచుకోనున్నారు. మాల్యా మొత్తం 9000 కోట్ల రూపాయల మేరకు రుణంపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌ పారిపోయి తలదాచుకున్నాడు. కాగా, కింగ్‌ఫిషర్‌ విల్లాను నటుడు, నిర్మాత సచిన్‌ జోషి వేలంలో కొనుక్కోవడం గమనార్హం.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*