అమెరికా వెళ్లి 25 రోజులే…!

న్యూఢిల్లీ : అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ళ విక్రమ్‌ జర్యాల్‌ అనే వ్యక్తిని ముసుగులు ధరించిన కొందరు దోపిడీదొంగలు కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన విక్రమ్‌ 25 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు చెందిన ఓ గ్యాస్‌స్టేషన్‌లో క్యాష్‌కౌంటర్‌లో పనిచేస్తున్నాడు. అర్థరాత్రి కొందరు దోపిడీదొంగలు ఆ కౌంటర్‌ దగ్గరకు వచ్చి రివాల్వర్లతో బెదిరించి క్యాష్‌ డిమాండ్‌ చేశారు. తన వద్ద ఉన్న క్యాష్‌ అంతా ఇచ్చేసిన తర్వాత వారు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఉపాధి కోసం కేవలం 25 రోజుల క్రితమే వెళ్లిన విక్రమ్‌ హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ ఘటనకు సంబంధించిన నివేదికను తెప్పించుకొని అవసరమైన సహాయం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు చేపట్టింది. త్వరలోనే మృతదేహాన్ని ఇండియాకు తరలించనున్నారు.

http://www.newstelugu.net
www.newstelugu.net

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*