మణిరత్నం ‘చెలియా’ మూవీ రివ్యూ!

Cheliya Movie Review
Cheliya Movie Review
Share
Cheliya Movie Review
Cheliya Movie Review

మూవీ : చెలియా, విడుదల : 07-04-2017

నటీనటులు : కార్తీ, అదితీరావు హైదరీ, లలిత, శ్రద్ధాశ్రీనాథ్, రుక్మిణి విజయ్‌కుమార్.
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఫోటోగ్రఫీ : రవివర్మన్, నిర్మాత : మణిరత్నం, శిరీష్, దర్శకత్వం : మణిరత్నం.
ఒక సామాజిక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలకు ప్రేమను సమ్మిళితం చేసి ఒక మంచి దృశ్యకావ్యంగా మలచడంలో మణిరత్నం ఆయనకు ఆయనే సాటి. గీతాంజలి, బొంబాయి, సఖి, రోజా, దిల్‌సే, ఒకే బంగారం వంటి ఎన్నో సినిమాలు ఆ మార్కుతో సాగినవే. క్లైమాక్స్‌లో ప్రేమ విజయం సాధించవచ్చు, ఓడిపోవచ్చు, లేదా ఇంకేదైనా అంశం గెలవచ్చు. ఆఖరి నిమిషం దాకా కథ ముగింపు ఏంటనేది తెలియకుండా జాగ్రత్తపడటమే మణిరత్నం మార్కు. అది కూడా కొత్తగా కన్పించడం ఆయన శైలి. మణిరత్నం మార్కు కన్వర్జేషన్‌తో విడుదలైన చిత్రం ‘చెలియా’ ఆయన ఖాతాల్లో ఇంకొక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది.
కథ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వరుణ్ (కార్తీ) ఓ ఫైటర్ పైలట్. శ్రీనగర్ మిలటరీ హాస్పిటల్‌లో లీలా (అదితీరావు హైదరీ) డాక్టర్‌గా చేరుతుంది. ఇద్దరి మనస్తాత్వాలు చాలా భిన్నమైనవి. అయినప్పటికీ మనసులు కలుస్తాయి. ఇంతలో కార్గిల్ యుద్ధం రానేవస్తుంది. వరుణ్ యుద్ధవిమానం పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడుతుంది. పాక్ సైన్యానికి దొరికిపోవడంతో రావల్పిండి జైల్లో యుద్ధఖైదీగా ఉండాల్సివుంటుంది. జైలు నుంచి విడుదలయ్యాడా? విడుదలైతే ప్రేయసి లీలాను కలుస్తాడా? లేదా ఇంకేదైనా ముగింపు ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్ : తెలుగు ప్రేక్షకులకు మాస్ హీరోగా ముద్రపడిన కార్తీ ఈ సినిమాలో కొత్తగా కన్పిస్తాడు. పైగా మీసం ఉండదు. దీంతో ఏదోలా అన్పిస్తుంది. అయితే పెర్ఫార్మెన్స్ విషయంలో అదరగొట్టాడు. అతనికి జోడీగా నటించిన అదితీరావు హైదరీ దక్షిణాది సినిమాలకు తొలిసారిగా పరిచయమైంది. ఇద్దరి కెమెస్ట్రీ బాగా కుదరడంతో ప్రేమ సన్నివేశాలన్నీ బాగా పండాయి. క్లైమాక్స్ కొత్తగా వున్నప్పటికీ, వీరిద్దరి నటనకు పరాకాష్ఠగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా ఎవరికి వారు రాణించారు. ఇక ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అద్భుతం. పాటలన్నీ బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా వుంది. యుద్ధ సన్నివేశాలకు, ప్రేమ సన్నివేశాలకు మధ్య సంగీతంలో వేరియేషన్ అద్భుతంగా వుంది. మణిరత్నం దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక విధంగా చెప్పాలంటే మణిరత్నం డైరెక్షన్‌పై సమీక్ష చేసే అర్హత లేదన్నది వాస్తవం. సినిమా ఒక గొప్ప దృశ్యకావ్యంగా నిలిచింది. ప్రతి ఫ్రేమూ సాంకేతికంగా అల్టిమేటమ్. సినిమాను గ్రిప్ తీసుకురావడంలో మణిరత్నం యథావిధిగా విజయవంతమయ్యాడు. ఫోటోగ్రాఫర్ రవివర్మన్ పనితనం సూపర్. కాశ్మీర్ అందాలను తన కెమెరాలో బందీ చేశాడు. పాటల విషయంలో మణిరత్నం ఆలోచనలకు అనుగుణంగా నూటికినూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ కూడా బాగుంది.
అనాలసిస్ : మణిరత్నం భావనలు, కెమెరా పనితనం వెరసి ‘చెలియా’ ఓ మంచి దృశ్యకావ్యమైంది. ఫైటర్ పైలెట్‌గా కార్తీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కుర్రాళ్ళకు నచ్చుతుంది. పతాక సన్నివేశాలు సినిమాకు హైలైట్. కాకపోతే ఇలాంటి ముగింపులు కొందరికి నచ్చకపోవచ్చు. తొలి అర్థభాగం రోమాన్స్, డ్రామా ఆకట్టుకున్నాయి. ద్వితీయార్థం దేశభక్తిని రగుల్కొల్పుతుంది. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా మరో హైలైట్. కీలక సన్నివేశాలను సంగీతం మరింత పండిస్తుంది. ద్వితీయార్థంలో కార్తీ క్యారక్టరైజేషన్ తేడాగా వుంటుంది. సంబంధాలను విస్మరించాల్సిన పనేముందని అన్పిస్తుంది. ఈ సీన్లను కాస్త మారిస్తే ఇంకా బాగుండేదేమో. సాంకేతికపరంగా ఉత్తమ చిత్రాల్లో ‘చెలియా’ ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కొన్ని సన్నివేశాలు దారితప్పినట్లుగా అన్పిస్తాయి. ఏదేమైనప్పటికీ విజువల్స్, రోమాన్స్, యుద్ధ సన్నివేశాలు, మణిరత్నం మార్కు సీన్లు కచ్చితంగా సినిమాకు ఎలివేషన్ ఇచ్చాయని చెప్పవచ్చు.
ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే? : ఇది మణిరత్నం సినిమా కాబట్టి మంచిచెడులను పక్కనబెట్టి ఈ సినిమాను చూసి తీరాల్సిందే!
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*