తెలుగు చిత్రం ‘పెళ్లిచూపులు’కు జాతీయ అవార్డులు

Pellichoopulu, Shathamanam Bhavath, Janatha Garragei
Pellichoopulu, Shathamanam Bhavath, Janatha Garragei
Share
Pellichoopulu, Shathamanam Bhavath, Janatha Garragei
Pellichoopulu, Shathamanam Bhavath, Janatha Garragei
Ventilator Marathi Movie
Ventilator Marathi Movie

శతమానం భవతి, జనతా గ్యారేజీలకూ అవార్డులు
ఉత్తమ నటుడుగా అక్షయ్‌కుమార్‌
జాతీయ సినిమా అవార్డులు ప్రకటన
ఉత్తమ దర్శకుడు రాజేష్‌ మపుస్క (మరాఠీ), ఉత్తమ చిత్రం కాసవ్‌ (మరాఠీ)

న్యూఢిల్లీ : 64వ జాతీయ సినిమా అవార్డులను శుక్రవారంనాడు ప్రకటించారు. న్యూఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌లో ప్రియదర్శన్‌ సారధ్యంలోని అవార్డుల జ్యురీ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2016 మార్చి నెల నుంచి విడుదలైన 300కు పైగా

Neerja
Neerja

చిత్రాలను అవార్డుల పరిధిలోకి స్వీకరించినట్లు ప్రియదర్శన్‌ తెలిపారు. తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు అవార్డు కైవసం చేసుకుంది. ఈ సినిమాకు ఉత్తమ సంభాషణల అవార్డు కూడా దక్కింది. ఇక ఉత్తమ ప్రజాదరణ గల చిత్రంగా శతమానం భవతి నిలిచింది. ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజు సుందరం (జనతా గ్యారేజీ) అవార్డు గెల్చుకున్నాడు. ఉత్తమ చిత్రంగా కాసవ్‌ (మరాఠీ), ఉత్తమ హిందీ చిత్రంగా ‘నీరజ’ ఎంపికకాగా, ఉత్తమ దర్శకుడిగా రాజేష్‌ మపుస్క (మరాఠి సినిమా వెంటిలేటర్‌) ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటుడిగా రుస్తం సినిమా హీరో అక్షయ్‌కుమార్‌ పురస్కారం పొందారు.

ఈ అవార్డుల పూర్తి జాబితా ఇలావుంది :

Kaasav Marathi Movie
Kaasav Marathi Movie

ఉత్తమ నటుడు : అక్షయ్‌కుమార్‌ (రుస్తం)
ఉత్తమ నటి : సురభి (మిన్నామినుంగు)
ఉత్తమ దర్శకుడు : రాజేష్‌ మపుస్క (వెంటిలేటర్‌, మరాఠీ)
ఉత్తమ చిత్రం : కాసవ్‌ (మరాఠీ)
ఉత్తమ మెన్షన్‌ : ఆదిల్‌ హుస్సేన్‌
ఉత్తమ హిందీ చిత్రం : నీరజ
ఉత్తమ తెలుగు చిత్రం : పెళ్లిచూపులు
ఉత్తమ సంభాషణలు : తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
ఉత్తమ నృత్య దర్శకత్వం : రాజు సుందరం (జనతా గ్యారేజీ)
ఉత్తమ ప్రజాదరణ గల చిత్రం : శతమానం భవతి
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (పురుషుల విభాగం) : సుందర అయ్యర్‌ (జోకర్‌, తమిళం)
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మహిళల విభాగం) : ఇమాన్‌ చక్రవర్తి (ప్రక్తాన్‌, తుమీజాకో భాలోబషో పాటకు)
ఉత్తమ ఎడిటింగ్‌ : వెంటిలేటర్‌ (మరాఠీ)
ఉత్తమ రచయిత : జి.ధనుంజయ్‌
ఉత్తమ సంగీత దర్శకులు : బాపు పద్మనాభ (అల్లం-కన్నడ)
ఉత్తమ చలనచిత్ర స్నేహపూర్వక రాష్ట్రం : ఉత్తరప్రదేశ్‌
ఉత్తమ చలనచిత్ర స్నేహపూర్వక రాష్ట్రం (స్పెషల్‌ మెన్షన్‌) : జార్ఖండ్‌
ఉత్తమ నటి స్పెషల్‌ మెన్షన్‌ : సోనమ్‌ కపూర్‌ (నీరజ)
ఉత్తమ తమిళ చిత్రం : జోకర్‌
ఉత్తమ మళయాళ చిత్రం : మహేషింటే ప్రతీకారం

Rustom
Rustom

ఉత్తమ కన్నడ చిత్రం : రిజర్వేషన్‌
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు : శివాయ్‌
ఉత్తమ బెంగాలీ చిత్రం : బిసర్జన్‌
ఉత్తమ మరాఠీ చిత్రం : దశక్రియ
ఉత్తమ జ్యురీ అవార్డు : మోహన్‌లాల్‌
ఉత్తమ సహాయ నటి : జైరా వాసిం (దంగల్‌)
ఉత్తమ గేయ రచయిత : ఎంద పక్కం పాట (ధర్మ దురై)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 24 ది మూవీ
ఉత్తమ బాలనటుడు : కుంజు దేవమ్‌, ఆర్దిష్‌ ప్రవీణ్‌, షాజ్‌పాఠక్‌
ఉత్తమ యాక్షన్‌ డైరెక్టర్‌ : పులి మురుగన్‌
ఉత్తమ చిత్రం (సామాజిక సమస్యలు) : పింక్‌
ఉత్తమ బాలల చిత్రం : ధనక్‌
ఉత్తమ మెన్షన్‌ అవార్డు : ది ఐస్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం : ది టైగర్‌ హూ క్రాస్డ్‌ ది లైన్‌
ఇందిరాగాంధీ అవార్డు (తొలి చిత్రం దర్శకుడు) : ఖలీఫ్‌ (బెంగాలీ)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్టర్‌ (స్టంట్స్‌) : పీటర్‌ హెయిన్స్‌ (పులిమురుగన్‌)
ఉత్తమ సినిమా పుస్తకం : లతా సుర్గత (లతామంగేష్కర్‌ జీవితంపై రాసిన పుస్తకం)

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*