మంచుపెళ్లలు విరిగిపడి ముగ్గురు సైనికులు దుర్మరణం

Avalanches
Avalanches
Share
Avalanches
Avalanches

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని లఢక్‌ ప్రాంతంలో గల బతాలిక్‌ సెక్టార్‌లో ఒక సైనిక స్థావరంపై మంచు పెళ్లలు విరిగిపడిన కారణంగా ముగ్గురు సైనికులు దుర్మరణం పాలైనట్లు శుక్రవారంనాడు సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి ఊహించని విధంగా బతాలిక్‌ సెక్టార్‌లో మంచుపడిందని, దీంతో మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు సైనికులు చిక్కుకుపోయారన తెలిపారు. అయితే అందులో ఇద్దర్ని రక్షించగలిగామని, మిగిలిన ముగ్గురు మంచులో సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. మూడు మృతదేహాలను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కాగా, కాక్సర్‌ సెక్టార్‌లో కూడా మంచుపెళ్లలు విరిగిపడ్డాయని, అయితే సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*