ఇకపై పెట్రోధరలు ప్రతి రోజూ!

Petrol prices
Petrol prices
Share
Petrol prices
Petrol prices

న్యూఢిల్లీ : మన దేశంలో సహజంగానే నెల రోజులకో, వారం రోజులకో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వుంటాయి. ఒకప్పుడు ఆరు మాసాలకోసారి పెరగడమో, తగ్గడమో జరిగేది. దశాబ్దకాలంగా నెల రోజులకోసారి మార్పులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో వచ్చిన మార్పులను బట్టి దేశంలో పెట్రో ధరల్లో మార్పులొచ్చేవి. అయితే తాజా వార్త ఏమిటంటే, ఇకపై ప్రతిరోజూ పెట్రోల్‌ ధరల్లో మార్పులు కన్పిస్తాయట! ఏరోజుకారోజు పెట్రోల్‌ ధరలు మారుతూ వుంటాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై కసరత్తు మొదలుపెట్టాయి కూడా. దేశంలో రిటైల్‌ ఇంధన మార్కెట్‌లో 90 శాతం ఆధిపత్యం కలిగిన ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇక ప్రతిరోజూ నిర్ధారించనున్నాయి. అంటే అంతర్జాతీయ మారక ద్రవ్యం మార్పుల తరహాలో అన్నమాట! రూపాయి ధర, బంగారం, వెండి ధరలు ఎలాగైతే రోజూ మారుతూ వుంటాయో ఇకముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా అలాగే మారుతాయన్నమాట! పెట్రోల్‌ బంక్‌కు మన వాహనాన్ని తీసుకువెళ్లగానే ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ‘ఇంత ధర వుంది’ అని చెపితే ఆ మేరకు మనం ట్యాంకు నింపుకోవాల్సివుంటుంది. శుక్రవారంనాడు ఎకనామిక్‌ టైమ్స్‌లో ఈ మేరకు ఒక కథనం వెలువడింది. ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్‌ ఆయల్‌ కార్పొరేషన్‌తోపాటు భారత్‌ పెట్రోలియం,హిందూస్థాన్‌ పెట్రోలియం సంస్థలు మూకుమ్మడిగా మార్గాలను అన్వేషిస్తున్నాయని ఈ సంస్థల ప్రతినిధులు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికకు వెల్లడించారు. అయితే దీనిపై వెంటనే వ్యాఖ్యానించేందుకు, వివరాలిచ్చేందుకు ఈ కంపెనీలు నిరాకరించాయి. ‘డైలీ ప్రైస్‌ ఛేంజింగ్‌’ను డైనమిక్‌ ఫ్యూయిల్‌ ప్రైసింగ్‌గా ఈ కంపెనీలు అభివర్ణించాయి. ఇంధన ధరల్లో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడమే ఈ కొత్త ధరల నియంత్రణ విధాన ఉద్దేశమని ఆ కంపెనీలు పేర్కొన్నాయి.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*