అంతరిక్షంలో మరో భూగ్రహం!

Earth-like planet as water world
Earth-like planet as water world
Share
Earth-like planet as water world
Earth-like planet as water world

వాషింగ్టన్‌ : అచ్చం భూమి తరహాలోనే మరో గ్రహం ఉన్నట్లు తేలింది. భూమి వంటి ఒక గ్రహాన్ని కనుగొన్నట్లు అంతరిక్ష పరిశోధకులు తాజాగా ప్రకటించారు. దీనికి గ్లీస్‌ 1132బి లేదా జిజె 1132బి అని నామకరణం చేశారు. వేలా పాలపుంతలో 39 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్లీస్‌ గ్రహం వుందని ప్రకటించారు. మన భూ గ్రహం కన్నా 1.4 రెట్లు పెద్దగా ఇది వుందని, అక్కడ 250 సెల్షియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదొక జల ప్రపంచం (వాటర్‌ వరల్డ్‌)గా ఉండిఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. సౌర వ్యవస్థకు వెలుపల వేలా పాలపుంతలో ఈ గ్రహం ఉన్నందున ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. వాస్తవానికి 2015వ సంవత్సరంలోనే ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పటికీ, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఆనాడు నిర్ధారించలేదు. తాజాగా 2017 ఏప్రిల్‌ 6వ తేదీ ఆస్ట్రోనామికల్‌ జర్నల్‌లో శాస్త్రవేత్తలు ఈ గ్రహం వివరాలను పూర్తిగా వెల్లడించారు. ఈ గ్లీస్‌ గ్రహం చుట్టూ వాతావరణం వుందని, ఇందులో నీళ్ళు, మిథేన్‌ ఆవరించి వున్నాయని ప్రకటించారు. చిలీలోని యూరోపియన్‌ సౌత్‌ అబ్జర్వేటరీ నుంచి అత్యంత శక్తివంతమైన ఇఎస్‌ఓ/ఎంపిజి టెలీస్కోప్‌ ద్వారా ఏడు భిన్న కోణాల నుంచి అంతరిక్ష పరిశోధకులు వివిధ పరిశోధనలు చేసిన మీదట ఈ గ్రహం పరిస్థితిని అంచనా వేశారు. మన భూమి తరహాలోనే అక్కడ కూడా వాతావరణ పరిస్థితులు ఉన్నందున బహుశా అక్కడ కూడా జీవించవచ్చని కీలే యూనివర్శిటీ (యుకె) శాస్త్రవేత్త డాక్టర్‌ జాన్‌ సౌత్‌వర్త్‌ తెలిపారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*