సిరియాపై అమెరికా 60 క్షిపణులతో దాడి, 6గురు మృతి

US strikes Syrian base
US strikes Syrian base
US strikes Syrian base
US strikes Syrian base

వాషింగ్టన్‌ : సిరియాలో పౌరులపై రసాయన దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా తొలిసారిగా ఆ దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగింది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగడం ఇదే మొదటిసారి. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీగా క్రూజ్‌ క్షిపణులను సిరియాపై అమెరికా ప్రయోగించిందని అమెరికా అధికారులు ధృవీకరించారు. సెంట్రల్‌ సిరియాలో ప్రభుత్వ నియంత్రణలో వున్న షయరత్‌ ఎయిర్‌బేస్‌పై అమెరికా యుద్ధవిమానాలు క్షిపణులను ప్రయోగించింది. 60కి పైగా క్షిపణులను అమెరికా ప్రయోగించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రజలపై రసాయనాలను ప్రయోగించిన సిరియా సైనిక విమానాలు బయలుదేరిన కొద్ది క్షణాలకే అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 8.45 గంటలకు అంటే సిరియాలో శుక్రవారం వేకువజామున అమెరికా క్షిపణలతో దాడి చేసిందని అధికారులు తెలిపారు. గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రోయర్‌ యుఎస్‌ఎస్‌ పోర్టర్‌ (డిడిజి 78) ద్వారా అమెరికన్‌ క్షిపణుల దాడి జరిగింది. సిరియా అంతర్యుద్ధంలో జోక్యంచేసుకోబోమని ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ట్రంప్‌ ఈ దాడులకు పూనుకోవడం మిగిలిన ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సిరియా ప్రభుత్వం పౌరులపై రసాయనదాడులు చేసిన తర్వాత వేలాది మంది పిల్లలు మరణించారు. ఈ ఫోటోలను చూసిన తర్వాత కలతచెందిన ట్రంప్‌ తాజాగా అమెరికన్‌ తోమాహాక్‌ క్షిపణులతో దాడులకు ఆదేశించినట్లు తెలిసింది. మధ్యదరా సముద్రంలోని తమ యుద్ధ నౌకల నుంచి 60కి పైగా క్షిపణులతో అమెరికా దాడులు చేసిందని అధికారులు తెలిపారు.

Latest : ఈ దాడుల్లో ఆరుగురు సిరియా సైనికులు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం.

http://www.newstelugu.net
www.newstelugu.net

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*