తమిళనాడులో 35 చోట్ల ఐటి దాడులు

గవర్నమెంట్‌ ఎస్టేట్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌
గవర్నమెంట్‌ ఎస్టేట్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌
గవర్నమెంట్‌ ఎస్టేట్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌
గవర్నమెంట్‌ ఎస్టేట్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌

మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌కుమార్‌ ఇంటిపైనా దాడులు

చెన్నై : ఓ వైపు ఏప్రిల్‌ 12న జరిగే ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం పరువు పోయింది. ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ నివాసంతోపాటు ఆయనకు చెందిన వివిధ ప్రైవేటు నివాసాలు, ఆస్తులు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (ఐటి) అధికారులు శుక్రవారం ఉదయాన్నే దాడులు నిర్వహించారు. ఆర్‌.కె.నగర్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఐటి దాడులు జరగడం గమనార్హం. ఎఐఎడిఎంకె శశికళ వర్గానికి చెందిన టిటివి దినకరన్‌ తరపున విజయభాస్కర్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దండిగా డబ్బులు మారుస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఐటి అధికారులు గవర్నమెంట్‌ ఎస్టేట్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌తోపాటు పుదుకొట్టయ్‌, ట్రిచీలలో విజయభాస్కర్‌కు చెందిన ఆస్తులపై దాడి చేసి సోదా చేశారు. అలాగే నటుడు, రాజకీయనాయకుడు శరత్‌కుమార్‌కు చెందిన నీలాంకరాయి నివాసంపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. వీరితోపాటు ఎఐఎడిఎంకె మాజీ శాసనసభ్యులు చిట్టపాక్కం రాజేంద్రన్‌, డాక్టర్‌ ఎంజిఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ ఎస్‌.గీతాలక్ష్మి నివాసాలపై కూడా దాడులు జరిగాయి. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి దాదాపు 35 ప్రదేశాల్లో ఐటి దాడులు జరిగినట్లు వార్తలు అందాయి.

http://www.newstelugu.net
www.newstelugu.net

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*