కమల్‌హాసన్‌ డబ్బున్నవాడు కాదు : రజనీకాంత్‌

Kamal Haasan, Rajinikanth
Kamal Haasan, Rajinikanth
Share
Kamal Haasan,  Rajinikanth
Kamal Haasan, Rajinikanth

ముంబయి : కమల్‌హాసన్‌ సోదరుడు, ఇటీవలనే మరణించిన చంద్రహాసన్‌ సంస్మరణ కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. వారిలో రజనీకాంత్‌, సత్యరాజ్‌, నాసర్‌, విశాల్‌, కె.ఎస్‌.రవికుమార్‌, ఇళయరాజా తదితరులు వున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ, కమల్‌హాసన్‌కు ఇతర నటులతో పోల్చిచూస్తే పెద్దగా డబ్బులేదని, కమల్‌ స్వంతంగా ఆస్తిపరుడేమీ కాదని, అతని సోదరులే అతనికి పెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు. కె.బాలచందర్‌, అనంతు, చారుహాసన్‌, చంద్రహాసన్‌లను తన లైఫ్‌లైన్లుగా కమల్‌ భావించారని కూడా చెప్పారు. చంద్రహాసన్‌ను తాను రెండుసార్లు కలిసినట్లు రజనీకాంత్‌ చెప్పారు. చారుహాసన్‌ను అన్నగా పిలిచేవాడినని, కమల్‌తోనే తానెప్పుడూ వుంటానని రజనీ తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా తమిళ చిత్రపరిశ్రమను ఏలుతున్న కమల్‌, రజనీలు మంచిమిత్రులు కూడా. వీరి స్నేహాన్ని, వ్యక్తిగత సంబంధాలు మొదట్నించీ అలాగే వుండటం విశేషం.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*