పార్లమెంటులో ఫ్లైట్‌ ఫైట్‌ : అశోక్‌గజపతిరాజుపై దాడి?

Shiv Sena MPs heckle Ashok Gajapathi Raju in Parliament
Shiv Sena MPs heckle Ashok Gajapathi Raju in Parliament
Share
Shiv Sena MPs heckle Ashok Gajapathi Raju in Parliament
Shiv Sena MPs heckle Ashok Gajapathi Raju in Parliament

న్యూఢిల్లీ (ఎన్‌టిఎన్‌) : పార్లమెంటు సాక్షిగా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుపై శివసేనకు చెందిన ముగ్గురు ఎంపీలు దురుసుగా వ్యవహరించారు. శివసేన ఎంపీ గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడంపై శివసేన ఎంపీలు గురువారంనాడు లోక్‌సభలో అభ్యంతరం తెలిపారు. తక్షణమే గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన ముగ్గురు ఎంపీలు మంత్రి అశోక్‌గజపతి రాజు వద్దకు వెళ్లి చుట్టుముట్టారు. ఆయన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. ప్రత్యేకించి శివసేన ఎంపీ అనంత్‌ గీతే అసభ్యకరంగా వ్యవహరించినట్లు వీడియో ఫుటేజ్‌లో కన్పిస్తోంది. బిజెపి మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు అనంత్‌ గీతేను వారించి ఆయనను అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయారు. మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ కూడా శివసేన ఎంపీలను వారించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టిడిపి ఎంపీలు వెంటనే అక్కడకు చేరుకొని అశోక్‌కు రక్షణగా నిలబడ్డారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కూడా ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయాన్ని మంత్రి సుజనా చౌదరి ధృవీకరించారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*