భారత్‌-చైనా మాటల యుద్ధం

Dalai Lama
Dalai Lama
Share
Dalai Lama
Dalai Lama

బీజింగ్‌/న్యూఢిల్లీ : భారత్‌, చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో దలైలామా పర్యటన ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దలైలామాను ఎందుకు వెనుకేసుకువస్తున్నారని చైనా హెచ్చరించగా, ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని, చైనా అంతగా ఆవేశపడాల్సిన పనేమీ లేదని భారత్‌ పేర్కొంది. పైగా పైగా దలైలామా విషయంలో చైనా అదేపనిగా హెచ్చరికలు చేస్తే సహించేదిలేదని కూడా భారత్‌ మంత్రి కిరణ్‌ రిజ్‌జు హెచ్చరించారు. దలైలామా పర్యటన భారత్‌-చైనా సంబంధాలకు తీవ్రవిఘాతం కలిగిస్తున్నదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చున్యింగ్‌ విలేకరులకు తెలిపారు. ఈ చర్యను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టంచేశారు. కాగా, చైనా మీడియా కూడా భారత్‌కు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించింది. భారత్‌పై దాడిచేస్తే చైనాకు ఏమైనా నష్టమా? అని అర్థమొచ్చేలా ఓ పత్రిక ఎడిటోరియల్‌ రాయడం చర్చనీయాంశమైంది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*