కాశ్మీర్‌లో చైనా జోక్యం తప్పదు!

India and China war of words
India and China war of words
Share
India and China war of words
India and China war of words

బీజింగ్‌ : చైనా విషయంలో భారత్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నందున కాశ్మీర్‌ విషయంలో చైనా జోక్యం తప్పనిసరిలా కన్పిస్తున్నదని చైనా మీడియా పేర్కొంది. దలైలామాను మరీ ఎక్కువగా భుజాన వేసుకొన్ని తిరుగుతున్న భారత్‌కు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా భారత నాయకత్వం అసలు పట్టించుకోవడం లేదని, చైనా వ్యతిరేక తిరుగుబాటు నేతలను తోడ్పాటునిస్తున్న భారత్‌ను సహించేది లేదని చైనా నాయకత్వం గట్టిగా నిర్ణయించే పరిస్థితికి వచ్చినట్లు మీడియా కథనాలు ప్రచురించింది. గతంలో భారత్‌, చైనాల మధ్య జరిగిన యుద్ధం సమయంలో చైనా కాశ్మీర్‌లో భాగమైన ఆక్సాయిచిన్‌ను ఆక్రమించుకుంది. ఇప్పుడు ఈ ఆక్సాయిచిన్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవాలని చైనా భావిస్తున్నట్లు పత్రికలు పేర్కొన్నాయి. అంతేగాకుండా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎక్కువ భాగం దక్షిణ టిబెట్‌కు చెందినవని చైనా పేర్కొంది. ”భారత్‌ కంటే చైనా జిడిపి ఎన్నోరెట్లు ఎక్కువ. భారత్‌ కన్నా చైనా సైనిక సామర్ధ్యం కూడా చాలా ఎక్కువ. భారత్‌ దలైలామాను అడ్డంపెట్టుకొని ఇలా డ్రామాలు ఆడుతున్న నేపథ్యంలో భారత్‌పై చైనా దాడిచేస్తే ఎవరు గెలుస్తారు? బీజింగ్‌ను న్యూఢిల్లీకి చేజార్చుకుంటామా?. చైనా ఓడిపోతుందా? భారత్‌ ఓడిపోతుందా?’ అని బీజింగ్‌కు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతివ్వడం ద్వారా భారత్‌ డర్టీగేమ్స్‌ ఆడుతోందని కూడా ఆ పత్రిక విమర్శించింది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*