అన్నింటినీ దాటేసిన రెడ్‌మి ఫోన్లు!

Mi seies Top android phones
Mi seies Top android phones
Share
Mi seies Top android phones
Mi seies Top android phones

శామ్‌సంగ్‌, ఆపిల్‌ను కూడా తొక్కేసిన షియోమి

బీజింగ్‌ : ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల ఫోన్‌ బ్రాండ్‌గా షియోమి అవతరించింది. షియోమి విడుదల చేసి ఎంఐ ఫోన్లు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శామ్‌సంగ్‌, ఆపిల్‌ ఫోన్లను షియోమి తొక్కేసింది. అతిపెద్ద ఆ రెండు బ్రాండ్లను కాదని షియోమి ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. వచ్చే ఆరు మాసాల్లో ఇండియాలో ఆండ్రాయిడ్‌ యూజర్లలో మూడో వంతు ఫోన్లు షియోమి ఫోన్లే కానున్నాయని స్ట్రేటజీ అనలటిక్స్‌ కొత్త నివేదిక వెల్లడించింది. షియోమి బ్రాండ్‌కు చెందిన ఎంఐ ఫోన్లతోపాటు రెడ్‌మి వెర్షన్‌కు చెందిన దాదాపు అన్ని ఫోన్లపై వినియోగదారులు విపరీతమైన క్రేజీని ప్రదర్శిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. కొన్ని మాసాల క్రితం విడుదలైన రెడ్‌మి నోట్‌ 4 ఫోన్‌ను ఎంత ఉత్పత్తి చేసినా మార్కెట్‌లో దొరకడం లేదని, ఆ ఫోన్‌కు వున్న క్రేజీ ఇంతా అంతా కాదని నివేదిక తెలిపింది. 2000 మంది వినియోగదారులను సర్వే చేయగా, అందులో 26 శాతం మంది షియోమి బ్రాండ్‌ను వాడుతున్నట్లు తెలిపారు. అంటే మరో ఆరు మాసాల్లో శామ్‌సంగ్‌, ఆపిల్‌ ఫోన్లను వదిలేసి రెడ్‌మి ఫోన్లను ఎంచుకోనున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఆపిల్‌, శామ్‌సంగ్‌లను 12 శాతం మంది ఎంచుకున్నారని తెలిపింది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*