సన్‌రైజర్స్‌ శుభారంభం

యువరాజ్‌సింగ్‌
యువరాజ్‌సింగ్‌
Share
యువరాజ్‌సింగ్‌
యువరాజ్‌సింగ్‌

కోహ్లీసేనకు తొలి ఓటమి

హైదరాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : ఐపిఎల్‌ క్రికెట్‌ టోర్నమెంటులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ శుభారంభం పలికింది. కోహ్లీ సారధ్యంలోని బెంగుళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ 35 పరుగుల తేడాతో బెంగుళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా, బెంగుళూరు ఇంకా రెండు బంతులు మిగిలివుండగానే 172 పరుగులకే ఆలౌట్‌ అయింది. యువరాజ్‌సింగ్‌ కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేయగా, మోయిజెస్‌ హెన్రిక్స్‌ 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. శిఖర్‌ ధావన్‌ కూడా రాణించి 31 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. బెంగుళూరు జట్టులో క్రిస్‌ గేల్‌ ధనాధన్‌మంటూ మూడు సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి 32 పరుగులు చేసి అవుటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మన్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. ట్రేవిస్‌ హెడ్‌ (30), కేదార్‌ జాధవ్‌ (31), మన్‌దీప్‌సింగ్‌ (24), షేన్‌ వాట్సన్‌ (22)లు మినహా మరెవ్వరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ఖాన్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*