కొలతలు ఎలా తీయాలో చెప్పండి?

Share

హైదరాబాద్‌ : ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక అమ్మాయి ఛాతిని టైలర్‌ టేపుతో కొలుస్తుండగా తీసిన దృశ్యాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. దీనిపై మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారు తీవ్ర విమర్శలు చేయగా, పలువురు అభిమానులు వారికి వ్యతిరేకంగా స్పందించారు. మీ సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు లేవా అంటూ దుయ్యబట్టారు. దీంతో ఈ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వాదోపవాదాలకు దారితీసింది. బట్టలు కుట్టేటప్పుడు చుట్టుకొలతలు తీయడం తప్పనిసరి. అలాంటప్పుడు కొలతలు ఎలా తీయాలో మీరే చెప్పండంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. టైలర్‌ అనే వ్యక్తి పురుషుడా? మహిళా?, కొలతలు తీయించుకున్న వ్యక్తి పురుషుడా? మహిళా? అన్నది అప్రస్తుతమని, ఎవరైనా కొలతలు తీయడానికి వేరేమార్గం ఇంకేదైనా వుందా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఏదేమైనప్పటికీ, ఈ హాట్‌టాపిక్‌ ఇంకొన్నాళ్ళు హల్‌చల్‌ చేసే అవకాశం లేకపోలేదు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*