అఖిల్‌ కొత్త మూవీ ప్రారంభం (ఫోటోలు)

Share

హైదరాబాద్‌ : అక్కినేని అఖిల్‌ హీరోగా కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మునిమనవరాలు సత్య సాగరి దేవుడి పటాలపై తొలి షాట్‌కు క్లాప్‌ ఇవ్వగా, ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్‌ చేశారు. సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘మనం’ సాంకేతిక బృందంతో నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్‌ అవుతుందని నాగార్జున ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అఖిల్‌తోపాటు అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్య, విక్రమ్‌ కె.కుమార్‌, నాగసుశీల, యార్లగడ్డ సురేంద్ర, సుమంత్‌, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అనూప్‌ రూబెన్‌ సంగీతం అందిస్తున్నారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*