హాట్‌ టాపిక్‌గా మారిన పోస్టర్‌!

Fashion Designer s/o Ladies Tailor
Fashion Designer s/o Ladies Tailor
Share
Fashion Designer s/o Ladies Tailor
Fashion Designer s/o Ladies Tailor

హైదరాబాద్‌ : ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌పై పలువురు హీరోయిన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో దాన్ని సమర్ధించినవారూ వున్నారు. ఈ పోస్టర్‌ను విడుదల చేయగానే మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. మహిళలను ఇలా చూపడం ఇంకెన్నాళ్ళకు మానేస్తాం అంటూ ట్విట్టర్‌లో విమర్శించగానే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ దాన్ని సమర్థించారు. అయితే చాలా మంది నెటిజన్లు వారికి వ్యతిరేకంగా స్పందించారు. ‘మీ సినిమాల్లో ఇలాంటి సీన్లు లేవా?’ అంటూ దుయ్యబట్టారు. కాగా, నిర్మాత మధుర్‌ శ్రీధర్‌ స్పందిస్తూ ఈ చిత్రాన్ని ఒక పార్ట్‌గా మాత్రమే స్వీకరించామని, ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో లేవని, ఇది వంశీ చిత్రమని అన్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్నారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*