టీవీ సీరియల్స్‌ను రాజమౌళి ఏమన్నారో తెలుసా?

SS Rajamouli
SS Rajamouli
Share
SS Rajamouli
SS Rajamouli

హైదరాబాద్‌ : టీవీలో రోజూ వచ్చే సీరియల్స్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ వుంటారు. అయితే అవంటే చిరాకు పడే వాళ్ళు ఇంకా చాలామంది వున్నారు. రోజుల తరబడి, ఏళ్ళ తరబడి కూడా సాగే సీరియల్స్‌ అంటే మాత్రం చిరాకే. కానీ వాటికి కూడా మార్కెట్‌ వుంది. అందుకే ఎందరో స్టార్లు సైతం సీరియల్స్‌పై దృష్టి పెడుతుంటారు. బాహబలి దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బాహుబలి కథకు ప్రీక్వెల్‌గా వున్న ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ కథను టీవీ సిరీస్‌గా ప్రెజెంట్‌ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇవి సాధారణ సీరియల్స్‌లా కాకుండా కేవలం 13 ఎపిసోడ్లలో ముగిసేలా నాణ్యమైన సిరీస్‌లా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో రాజమౌళి టీవీ సీరియల్స్‌లో రోజూ వాడే సబ్బులా అభివర్ణించారు. ‘మనం టీవీలో చూసే ‘డైలీ సోప్‌’లా ఈ సిరీస్‌ వుండదని వ్యాఖ్యానించారు. డైలీ సోప్‌ అనే పదాన్ని సీరియల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినదే అన్నది అక్కడున్నవారందరికీ అర్థమైపోయింది. వాస్తవానికి ప్రస్తుత సీరియల్స్‌ కూడా డైలీ సోప్‌ల్లాగానే వున్నాయి.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*