బాహుబలిపై త్వరలోనే టీవీ సిరీస్‌ : రాజమౌళి

Baahubali TV series
Baahubali TV series
Share
Baahubali TV series
Baahubali TV series

హైదరాబాద్‌ : ఎస్‌ఎస్‌ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’కి కొనసాగింపు అయిన ‘బాహుబలి-ది కంక్లూజన్‌’ త్వరలో విడుదలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో దీనిపై వస్తున్న ఒక్కొక్క వార్త ఆసక్తిరేపుతోంది. తాజాగా బాహుబలిపై ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. బాహుబలి కథకు ప్రీక్వెల్‌గా విడుదల చేసిన పుస్తకం ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ ఆధారంగా ఈ మినీ టీవీ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ”ది రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో విడుదలైన మూడు పుస్తకాల ఆధారంగా ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నాం. అయితే మనం రోజూ టీవీలో చూసే డైలీ సోప్‌లా ఉండదది. దీన్ని 13 ఎపిసోడ్లలో అద్భుతమైన సీజనల్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నాం” అని రాజమౌళి చెప్పారు. బాహబలి మాత శివగామికి సంబంధించిన కథను మూడు భాగాలుగా ఆనంద్‌ నీలకంఠన్‌ అనే రచయిత రాశారు. అందులో మొదటి పుస్తకాన్ని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ కథలో శివగామి మాహిష్మతి రాజ్యానికి రాణి. కట్టప్ప అనే మరో అద్భుతమైన పాత్ర కూడా ఈ కథలోనే పరిచయమవుతుంది. శివగామి పాత్రలో ఒక రాజమాతతోపాటు ఒక గొప్ప యోధురాలు కన్పిస్తుందని ఈ సందర్భంగా రచయిత నీలకంఠన్‌ తెలిపారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*