మంత్రులుగా 11 మంది….ఊడింది 5గురికి

Nara Lokesh
Nara Lokesh
Share
Nara Lokesh
Nara Lokesh

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 11 మందికి మంత్రిపదవులు దక్కగా, ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఐదుగురికి చంద్రబాబు ఉద్వాసన పలికారు. ప్రముఖులు హాజరైన ఈ ప్రమాణోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ ఇసిఎల్‌ నరసింహన్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఎచ్చర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు (వేమూరు), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ), ఆర్‌వి సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం ఎమ్మెల్యే), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు ఎమ్మెల్యే), కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ (కొవ్వూరు ఎమ్మెల్యే), ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి (పలమనేరు ఎమ్మెల్యే), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే)లు వున్నారు. కాగా, ఉద్వాసనకు గురైన మంత్రుల్లో కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిశోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డిలు వున్నారు.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*