వివాహాల్లో ఊహించని అపశ్రుతులు

41479035579_625x300ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి మరుపురాని మధురానుభూతి. అందుకే పెళ్లి వేడుకను ప్రతి క్షణాన్ని ఫొటోలోనూ, వీడియో కెమెరాలో బంధిస్తాం. అడుగడుగునా ఆ మధురానుభూతుల్ని చూసుకొని మురిసిపోతాం. జీవితంలో ఎంతో కీలకమైనది కావడంతో పెళ్లి కోసం ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికలు వేసి.. పర్ఫెక్ట్‌గా నిర్వహించేందుకు తపిస్తాం. కానీ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లిళ్ల సందర్భంగా కొన్ని ఊహించని అపశ్రుతులు దొర్లుతుంటాయి.

అప్పటికప్పుడు జరిగిపోతుం‍టాయి. బంధుమిత్రులు, ఎవరో తెలియని కొత్తవారి ముందు జరిగే ఈ ఊహించని పరిణామాలు అప్పటికప్పుడు చికాకు కలిగిస్తాయి. జీవితంలోని కీలక సమయంలో జరిగిన ఈ అనుకోని అపశ్రుతులు కొందరికీ షాక్‌ కూడా మిగిలిస్తుంటాయి. పెళ్లిల్లో జరిగిన ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ఇప్పుడు ఒక వీడియోరూపంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ అపశ్రుతులు అప్పటికప్పుడు కొంత చికాకు కలిగించినా.. వీటిని చూసినవారికి మాత్రం ఒకింత నవ్వురాక మానదు.

పెళ్లి సందర్భంగా ఏడడుగులు వేస్తుండగా వరుడి పంచె వధువు పొరపాటున కాలుపెట్టడంతో వరుడి పంచె ఊడిపోవడం, తాళి కడుతుండగా వరుడి ముఖం నిండా నురగతో నింపడం, వరుడికి పూలమాల వేయబోతూ వధువు కిందపడిపోవడం, గుర్రం మీద నుంచి వరుడు పడిపోవడం వంటి అనుకోనివిధంగా దొర్లిన అపశ్రుతులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*