ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం

Share

amlaశీతాకాలంలో విరివిగా లభించే ఉసిరి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఉసిరి కంటే ఉత్తమమైంది మరొకటి లేదని పరిశోధనలు చెప్తున్నాయి. ఉసిరిలో మనిషి ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది. ఇందులో ప్రోటీన్ల శాతం యాపిల్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానిమ్మతో పోలిస్తే 27రేట్లకు పైగా విటమిన్ సీ లభిస్తుంది. ఇతర పండ్లు, కాయల కన్నా యాంటీఆక్సిడెంట్ల శాతం సైతం అధికంగానే ఉంటాయి. దీనిలో యాంటీవైరల్, యాంటీమైక్రోబియక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపర్చి కొవ్వును తగ్గిస్తుంది. అందుకే దీనిని వాత, పిత్త, కఫ దోష నివారణకు వినియోగిస్తుంటారు. అదేవిధంగా మందుల తయారీలోనూ ఉసిరిని ఎక్కువగానే వినియోగిస్తారు.
అందుకే కార్తీకమాసంలో ఉసిరిచెట్టును పూజిస్తారు.

ఉసిరితో ఉపయోగాలు…
* 43మూలికలు, వెన్న, నువ్వుల నూనె, చెరుకు రసం, తేనె కలిపి చేసే ప్రాచీనప్రాష్‌లో ఉసిరిదే కీలకపాత్ర.
* లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.
* రుతు సమస్యలను దూరం చేయడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
* ఉసిరి ఆహారంలో భాగంగా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తొలిగిపోతాయి.
* పొట్టలో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
L కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది.
* శరీరంలో కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.
* హృద్రోగాలు, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
* మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
* కఫ దోషం, ఊపిరితిత్తుల సమస్యను నివారిస్తుంది. శ్లేష్మాన్ని తొలగిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
* కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* ఉసిరిలో విటమిన్ సీ శరీరాన్ని వేడిమి నుంచి రక్షిస్తుంది. చర్మరోగాల నుంచి కాపాడుతుంది. చర్మానికి ఛాయనిస్తుంది. మొటిమల్ని తగ్గిస్తుంది.
* కేశపోషణలో ఉసిరిని మించింది లేదు. ఉసిరి పొడులు, శాంపూలు, నూనెలు చుండ్రుని నివారిస్తాయి.
* ఉసిరిని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కాల్షియం పోషణలో శరీరానికి సాయపడుతుంది. ఎముకలు, దంతాలు, గోళ్లు, కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

http://www.newstelugu.net/
http://www.newstelugu.net/
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*