చింతపండు-అల్లం పానీయం అద్భుతం

Share

చింతపండు ఉపయోగించి చాలా వంటకాలు చేస్తూ వుంటాం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చింతపండుతో లెక్కలేనన్ని వంటలు వున్నాయి. పులుపు అవసరమైన ప్రతి కూరకీ చింతపండు ఉపయోగించాల్సిందే. ఇక పప్పుచారు, సాంబార్‌, రసం, పచ్చిపులుసు వంటి వాటికి చింతపండు తప్పనిసరి. చింతపండు, అల్లం మిశ్రమంతో ఓ అద్భుతమైన కూర వండుకోవచ్చు. అదే టామరిండ్‌ జింజర్‌ మ్యాజిక్‌. దాని గురించి ఓసారి చూద్దాం.
కావలసిన పదార్థాలు : వేడినీరు-నాలుగుకప్పులు, బ్రౌన్‌ షుగర్‌-పావుకప్పు, క్రిస్టలైజ్‌డ్‌ జింజర్‌(అల్లం)…మూడు టీస్పూన్లు, చింతపండుపేస్ట్‌-రెండు టీస్పూన్లు, తాజా నిమ్మరసం-ఒకటీస్పూన్‌, తాజా పుదీనా ఆకులు-తగినన్ని, ఐస్‌క్యూబులు -సరిపడా,
తయారీ విధానం : ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో వేడినీరు, బ్రౌన్‌ షుగుర్‌, అల్లం, చింతపండు పేస్ట్‌లను వేసి బాగా కలియబెట్టాలి. ఈ పాత్రను స్టవ్‌పై ఉంచి సిమ్‌లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు వేడి చేయాలి. దీనికి నిమ్మరసాన్ని జతచేసి కిందికి దించి చల్లార్చాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై సర్వింగ్‌ గ్లాసులలో ముందుగానే తగినన్ని ఐస్‌క్యూబులను వేసి ఉంచాలి.
ఫ్రిజ్‌లోంచి మిశ్రమాన్ని తీసి బాగా కలియబెట్టి గ్లాసులలోకి ఒంపాలి. పైన తాజా పుదీనా ఆకులను వేసి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి. అంతే రుచికరమైన టామరిండ్‌ జింజర్‌ మ్యాజిక్‌ తయార్‌. వేసవితాపాన్ని ఇట్టే చల్లార్చే ఈ వెరైటీ డ్రింక్‌ తయారు చేయటం కూడా చాలా సులభం!

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*