నువ్వుల రొయ్యలు కూర!

Share

నువ్వులు రొయ్యలు కూర టేస్టే వేరని క్యూజిన్‌ నిపుణులు అంటూ వుంటారు. రొయ్యల కూరను సహజంగా వండటం ఒక విధానమైతే, నువ్వులకు ప్రాధాన్యమిస్తూ వండటం మరో విధానం. నువ్వుల రొయ్యల కూరను మీరు మీ ఇంట్లోనే వండుకోవచ్చు. అదెలాగో ఓసారి చూడండి.
కావలసినవి : రొయ్యలు-అరకిలో, రిఫైన్డ్‌ ఆయిల్‌- తగినంత, తెల్లనువ్వులు-25గ్రా, టోమాటా సాస్‌-2 టేబుల్స్‌స్పూన్లు, కొత్తిమీర తురుము-2 టేబుల్‌ స్పూన్లు, బియ్యంపిండి-2టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌- టేబుల్‌స్పూను, అల్లం-వెల్లుల్లిముద్ద-టీస్పూను, కారం-టీస్పూన్‌, మిరియాల పొడి-పావుటీస్పూన్‌, అజినవోటో-పావుటీస్పూన్‌, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : పొట్టుతీసి శుభ్రంచేసిన రొయ్యల్ని ఓ గిన్నెలో వేయాలి. అందులోనే నువ్వులు, టొమాటోసాస్‌, బియ్యంపిండి, కార్న్‌ఫ్లోర్‌, అల్లం-వెల్లులి ముద్ద, ఉప్పు, కారం, మిరియాలపొడి, అజినవోటో వేసి తగినన్ని నీళ్ళు చల్లి కలిపి ఉంచాలి. పదినిమిషాల తరువాత అన్నీ కలిపిన రొయ్యల్ని నూనెలో పకోడిల్లా దొరరంగులోకి వచ్చే వరకూ వేయించి తీయాలి. వీటిమీద కొత్తిమీర చల్లి వేడి వేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటాయి.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*