సౌందర్య రహస్యం వెనుక పసుపు!

Share

pasupuపసుపుతో ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

  1. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
  2. ఎక్కువ సేపు నీటిలోఉంటే పాదాలు నాని పగుళ్ళు, లేక ఒరుసుకు పోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది.
  3. పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
  4. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిమిషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
  5. శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.
  6. పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. దగ్గు ఉన్నప్పుడు చిటికెడు పసుపు వేసిన వేడినీటిని తాగుతూ వుంటే కచ్చితంగా దగ్గు తగ్గిపోతుంది.
http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*