ఇంటర్నెట్‌ ఒక్క నిమిషం ఆగిపోతే..?

Share

ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ సదుపాయం మారుమూల గ్రామాల్లోకి సైతం చొచ్చుకెళ్లిపోతోంది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. సకల పనులను ఇంటర్నెట్‌ సాయంతోనే చకచకా చక్కబెట్టేస్తున్నాం. ఇక సోషల్‌ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనుషుల్ని.. 24గంటలూ నెట్టింట్లోనే గడిపేలా చేస్తున్నాయి సామాజిక మాధ్యమాలు. ఇంటర్నెట్‌ అంతగా వాడేస్తున్నాం..! మరి అలాంటి ఇంటర్నెట్‌ సదుపాయం ప్రపంచమంతా ఒక్కసారిగా నిలిచిపోతే..? వూహకే అందట్లేదు కదూ..! కానీ.. ఈ కింది లెక్కలు చూస్తే అర్థమవుతుంది.. కేవలం ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్‌ పూర్తిగా నిలిచిపోతే ఏం జరుగుతుందనేది. ఆ వివరాలు..

* 22,63,020 జీబీల ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌
* గూగుల్‌- 33,63,780 అన్వేషణలు
* యూట్యూబ్‌- 78,21,360 వీక్షణలు(వ్యూస్‌)
* ఫేస్‌బుక్‌- 7,01,389 లాగిన్‌లు
* ట్విట్టర్‌- 4,39,860 ట్వీట్లు
* వాట్సాప్‌- దాదాపు 2కోట్ల 10లక్షల సందేశాలు
* ఇన్‌స్టాగ్రామ్‌- 44,400 ఫొటోల అప్‌లోడింగ్‌
* ఈమెయిల్స్‌- 15,12,20,340(ఇందులో 67శాతం స్పామ్‌ మెయిల్స్‌)
* స్నాప్‌చాట్‌- 5,27,760 ఫొటో షేర్లు
* స్కైప్‌- 1,35,480 కాల్స్‌
* తంబ్లర్‌- 69,240పోస్టులు
* యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి 51వేలకుపైగా యాప్‌ డౌన్‌లోడ్లు
* అమెజాన్‌- దాదాపు కోటి 40లక్షల విలువైన కొనుగోళ్లు
* లింక్డ్‌ఇన్‌-120కిపైగా కొత్త ఖాతాదారుల చేరిక
ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడితే.. ఇవన్నీ ఆగిపోతాయి. ఈ వివరాలు.. ‘ఇంటర్నెట్‌లైవ్‌స్టాట్స్‌.కాం’తో పాటు.. ‘ఇంటర్నెట్‌ వరల్డ్‌ స్టాట్స్‌’ సంస్థలు వెల్లడించినవి.

http://www.newstelugu.net/
http://www.newstelugu.net/
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*