ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయండి..!

Dieffenbachia Plant
Dieffenbachia Plant
Share
Dieffenbachia Plant
Dieffenbachia Plant

ఇండ్ల‌లో మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం చాలా మందికి అల‌వాటే. ఆ మాట కొస్తే ఆఫీసుల్లో, ఇత‌ర కార్యాల‌యాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతారు. అయితే వాటిలో అన్నీ మేలు చేసే మొక్క‌లు మాత్రం ఉండ‌వు. వాటిలో కొన్ని హానిక‌ర‌మైన‌వి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో డిఫెన్‌బాకియా (Dieffenbachia) మొక్క కూడా ఒక‌టి. వీటి ఆకులు పెద్ద‌గా ఉంటాయి. మ‌ధ్య‌లో తెల్లగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు, కాండం, పువ్వులు అన్నీ హానిక‌ర‌మేన‌ని, వీటిని ముట్టుకుంటే మొక్క‌లోని విష ప‌దార్థాలు నేరుగా ఒంట్లోకి ప్ర‌వేశిస్తాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇటీవ‌లే ఎస్తెబ‌న్ అనే 5 ఏళ్ల బాలుడు ఈ మొక్క బారిన ప‌డి హాస్పిట‌ల్‌లో చేరాడు. త‌మ ఇంట్లో ఉన్న ఈ మొక్క వ‌ద్ద ఆడుకుంటుండ‌గా అందులోని విష ప‌దార్థాలు ఎస్తెబ‌న్‌లోకి ప్ర‌వేశించాయి. దీంతో అత‌నికి క‌డుపునొప్పి, వాంతుల‌తో తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త క‌లిగింది. ఈ క్ర‌మంలో అత‌న్ని త‌ల్లిదండ్రులు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఎస్తెబ‌న్ చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాల‌కు ఏ ప్ర‌మాదం లేదు. అయితే అత‌ని తల్లిదండ్రులు మొద‌ట ఏమ‌నుకున్నారంటే స్వీట్లు తిన‌డం వల్లే ఎస్తెబ‌న్‌కు అలా జ‌రిగింద‌ని భావించారు. కానీ చివ‌ర‌కు పైన చెప్పిన మొక్కే కార‌ణ‌మ‌ని తెలిసింది. ఈ మొక్క వ‌ల్ల క‌డుపునొప్పి, వాంతుల‌తోపాటు కొన్ని సంద‌ర్భాల్లో నోట్లో, గొంతులో మంట‌, దృష్టి లోపం, డ‌యేరియా, కంటి నొప్పి, శ‌రీరం ఉబ్బిపోవడం వంటి అస్వ‌స్థ‌త‌లు క‌లిగి మ‌నిషి ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మొక్క గ‌న‌క మీ ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాల‌ని వారు సూచిస్తున్నారు.

http://www.newstelugu.net/
http://www.newstelugu.net/
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*