బెడ్‌రూమ్‌లో అలా చేయకూడదు! (సెక్స్‌ ప్రశ్న – డాక్టర్‌ సమాధానం 4)

Sex Couple
Sex Couple
Share
Sex Couple
Sex Couple

ఓ వ్యక్తి ప్రశ్న : నా వయసు 48 సంవత్సరాలు. నా భర్త వయసు 59 సంవత్సరాలు. ఆయన ఈ మధ్యనే రిటైరయ్యారు.(ప్రభుత్వ ఉద్యోగం) గడిచిన 2 సంవత్సరాల నుంచీ ఆయనకి అంగస్తంభన సరిగా జరగటం లేదు. ఎలాంటి ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండటం లేదు. అంగాన్ని ఇన్‌సర్ట్‌ చేసిన వెంటనే మెత్తగా అయిపోతోంది. ఈ రెండు సంవత్సరాలుగా సెక్స్‌ నీడ్స్‌ తీరక నేను పడుతున్న నరకం వర్ణనాతీతం. డాక్టర్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా కన్సల్ట్‌ చేద్దాం అంటే ఆయన జంకుతున్నారు. తాను ఆఫీసరుగా రిటైరయ్యాను కదా పరువుపోతుంది…అందుకే రాను అని అంటారు. వయాగ్రా వాడితే ప్రయోజనం ఉంటుందా? మాకు ఎక్కడ దొరుకుతుంది. ఇంకేదైనా మార్గం ఉందా?

– ఎ.పంకజం (పేరు మార్చబడింది), హైదరాబాద్‌

డాక్టర్‌ సమాధానం : సెక్సువల్‌ ప్రాబ్లమ్స్‌ చాలా సామాన్యమైనవి. అవి అన్ని వయసుల్లోనూ వస్తుంటాయి. ప్రైమ్‌ మినిస్టర్ల నుంచి పనిలేని వాళ్ళ దాకా ఎవరికన్నా ఈ సమస్యలు తప్పవు. తానున్న చోట కన్సల్ట్‌ చేయడానికి బిడియం అడ్డువస్తుంటే మీ వారు మరేదైనా దూరప్రాంతంలో కన్సల్టేషన్‌ తీసుకోవచ్చు కదా! సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించక పోవడమే అసలు సమస్య అని అర్థమవుతోంది!
మీ వారి అంగస్తంభన సమస్యకి – ఆయన వయసు దృష్టా – శారీరక కారణాలూ కారణం కావచ్చు, మానసిక కారణాలు కారణం కావచ్చు. కాబట్టి కౌన్సిలింగ్‌ చేయడం అవసరం అవుతుంది. కౌన్సిలింగ్‌తో పాటు ఔషధ చికిత్స కాని, ఇతర చికిత్సావిధానాలు కానీ అవసరపడతాయి. కేస్‌ హిస్టరీ, లాబ్‌ ఇన్వెస్టిగేషన్లు అయినాక మాత్రమే ఆయనకి మందులు పనికొస్తాయో, సలహాలే సరిపోతాయో, సర్జరీ పడుతుందో చెప్పడం సాధ్యమవుతుంది.
సెక్సు కోరికలుండి, అవి తీరకపోతే చాలా బాధ కలుగుతుండటం సహజం. ఆ సమయంలో స్త్రీ ఏవైనా మాటలాడి అవమానపర్చి, గాయపర్చి, కోపంతో విరుచుపడి …లేదా సెక్సులో పాల్గొని తీరాలని మంకుపట్టుపట్టడం, ‘నువ్వెందుకు పనికిరావు’ వంటి మాటలు ఆడటం, తదితర చర్యలతో యాగీ చేయడం జరుగుతూ వుంటుంది. (తిట్టేవాళ్లూ, తన్నేవాళ్ళూ కూడా ఉన్నారనుకొండి!) మొత్తానికి ఈ రియాక్షన్సన్సీ కూడా మగవాడి మీద నెగిటివ్‌గా పనిచేస్తాయి. అతను మరింత ముడుచుకు పోయేలా చేస్తాయి. ఉన్న కాస్త సామర్థ్యం అణిచిపోయేలా చేస్తాయి. అట్లాంటి సందర్భాలు మీ దాంపత్యంలో లేకుండా చూసుకోండి.
సెక్స్‌లో ప్రోత్సహించడమొక్కటే అతని పరిస్థితి దిగజారిపోకుండా… మెరుగుపడేలా… చేస్తుంది.
‘వయాగ్రా’ ఇప్పుడు అన్నిచోట్ల లభ్యమవుతోంది. అది సెక్సు సమస్యల్లో అద్భుత ఫలితాలిచ్చినప్పటికీ, కొన్ని విషయాల్లో ఫలితముండదు. పైగా పైకి తెలిసో, తెలియకనో హృద్రోగం ఉన్నవారికి వయాగ్రా ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశముంది కాబట్టి పరీక్షలన్నీ చేయించుకున్నాకే వయాగ్రా వాడటం క్షేమం.
ఏది ఏమైనా మీరు, మీ వారూ కలిసి సెక్స్‌ కౌన్సిలింగ్‌ తీసుకోవడం మంచిది. ముఖ్యవిషయం ఏమంటే, పడకగది దగ్గరకు వచ్చేసరికి ఆడవాళ్ళు ఉన్నంతలో అందంగా కన్పించాలి. నెగెటివ్‌ మాటలు ఆడకుండా ఉండాలి. మగాళ్ళను ప్రోత్సహిస్తూ వుండాలి. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలి. ఆ సమయంలో సెక్స్‌ తప్ప తమ ఇద్దరికీ వేరే పనిలేదు అన్నంత స్థితిని తీసుకురావాలి. బాధలు, బందీలు, డబ్బులు, ఇతర సమస్యలను బెడ్‌రూమ్‌కు తీసుకురాకూడదు. అలా చేస్తే ఎంత వయసువారైనా సెక్స్‌లో సక్సెస్‌ అయినట్లే. లేకుంటే బెడ్‌రూమ్‌ ఓ పార్లమెంటుగా మారిపోతుంది. సెక్స్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్ని చర్చావేదికలు పెట్టుకన్నా నో ప్రాబ్లమ్‌!

Read More Questions and Answers on Sex Problems

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*