అలా ఉంటేనే మూడొస్తుందని అంటున్నాడు! (సెక్స్‌ ప్రశ్న – డాక్టర్‌ సమాధానం 3)

Share
Actress Anushka
Actress Anushka (RP)

ఓ అమ్మాయి ప్రశ్న : నా భర్తదొక విచిత్రమైన మనస్తత్వం. తను నన్నెప్పుడూ చూసినా నీట్‌గా ముస్తాబై ఉండాలంటాడు. ఇంటికి దగ్గర్లోనే మా వారి షాష్‌ కూడా వుంది! కాఫీకో, భోజనానికో ఇంటికి వచ్చినప్పుడు వంటపనిలో ఉండి నీట్‌గా కనిపించకపోతే పేచీ పెడతాడు. నీట్‌గా లేకపోతే తనకి మూడ్‌ ఆఫ్‌ అయి పోతుందంటాడు. అక్కడికీ నేను సాయంత్రం పనులన్నీ అయిపోగానే స్నానం చేసేసి ముస్తాబై అతని కావలసినట్టే ఉంటాను. మధ్యాహ్నం నువ్వు నలిగిపోయిన బట్టలతో, చీరపైకి దోపి పనిపిల్లలా ఉన్నావు నాకు మూడ్‌ కరాబై పోయింది. ఇవాళ వద్దు అంటాడు. ఇష్టం లేక వంకలు పెడుతున్నాడనుకుంటే… ఏ రోజన్నా నేను అతనికి కావలిసినట్టు ఉంటే చాలా సంతోషపడతాడు. నన్ను కూడా ఆ వేళ చాలా సంతోషపెడతాడు. అయినా నీట్‌గా బట్టలు వేసుకుని పనెలా చేసుకుంటాం చెప్పండి?…
-రాణి (పేరు మార్చబడింది), చీరాల.

డాక్టర్‌ సమాధానం : ఏముందమ్మా ఇందులో. అతను కోరింది చిన్న కోరికే కదా! పైగా దాని వల్ల ఇద్దరికీ సంతోషం కలుగుతోందని నువ్వే అంటున్నావు కదా! అలాంటప్పుడు రోజంతా నీట్‌గా ఉండటం అలవర్చుకుంటే నష్టమేమిటి? ప్రతి మనిషికీ సెక్సు మూడ్‌ని ‘ఆన్‌’ ‘ఆఫ్‌’ చేసేవి కొన్ని విషయాలుంటాయి. అవి మాటలు కావచ్చు. చేతలు కావచ్చు. స్పర్శ, వాసన కావచ్చు. వాటిని గుర్తించడమే కొందరికి రాదు! గుర్తించినా వినియోగించుకోకపోతే ఎలా?
భార్యభర్తలిద్దరూ సాధ్యమైనంత వరకూ ఒకరి అభిరుచిని బట్టి ఒకరు నడుచుకుంటేనే వారి దాంపత్యం సంతోషంగా సాగుతుంది!
నీట్‌గా తయారై ఉన్న భార్యని చూసి భర్తా, భర్తను చూసి భార్య హ్యాపీగా ఫీలవడం సహజం. ఆ హ్యాపీనెస్‌కి అసలు కారణం ఆకర్షణే. పగలు మిమ్మల్ని చూసినప్పుడల్లా కలిగి ఆకర్షణ కాస్త ఒక్కో మెట్టు ఎక్కినట్లు, అతనిలో ఆత్రం పెరిగి రాత్రి అతను మీ పొందు కోసం తహతహలాడేటట్టు చేస్తుంది.
పగలు మీరు మీ భర్తకి వెగటు కలిగించే భంగిమలో కనిపిస్తే … ఆ దృశ్యం అతని మనసులో ముద్రవేసుకుంటే.. రాత్రి దాని ప్రభావం (కొందరిలో) తప్పక ఉంటుంది.
అందుకే మనిషిని బట్టి నడుచుకోవాలి. కొద్ది ప్రయత్నం చేస్తే రోజంతా నీట్‌గా ఉండటం మీకు అలవాటైపోతుంది. సెక్స్‌ అనేది చాలామంది శారీరకమైన ప్రక్రియ అని అనుకుంటూవుంటారు. కానీ నిజానికి అది నిజమైన మనసుతో కూడుకొని వున్న వ్యవహారం. సెక్స్‌ సంతృప్తి అనేది మనసుపై పడే ప్రభావం బట్టి వుంటుంది. అతను అలా కోరుకోవడం మానసిక రోగం కాదు. కొంతమంది మైండ్‌ సెట్‌ అలా వుంటుంది. పైగా అతను మీరు, ఇతరులు అసుహ్యించుకునే రీతిలో ఉండమనడం లేదు. రోజంతా అందాలతారలో ఉండమంటున్నాడు. అలాగే ఉండండి. పోయేదేముంది? చిటికెడు పౌడరు, నవనవలాడే చీర, ముఖంలో కాస్త చిరునవ్వు. అంతేకదా! అది మీ ఇద్దరికీ అమితానందాన్ని ఇస్తున్నప్పుడు అదే కొనసాగించడం ఉత్తమం.

(గమనిక : ఈ ప్రశ్నకు సమాధానం సెక్సాలజిస్ట్‌ ఇచ్చినది. దీని ఆధారంగా ఇతరులు ఫాలో అవ్వాలన్న నియమం లేదు. సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడమే కరెక్ట్‌, ఈ ప్రశ్న, సమాధానం అనేవి ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దయచేసి గమనించగలరు.)

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*