నాలో ఏదైనా లోపం వుందా! (సెక్స్‌ ప్రశ్న – డాక్టర్‌ సమాధానం 1)

Share
Sex Doubt
Sex Doubt

ప్రశ్న : నా వయస్సు 28 సంవత్సరాలు. నా భార్య వయస్సు 23 సంవత్సరాలు. మాకు పెళ్ళయి పదినెలలు కావస్తున్నది. మేము రోజుకు కనీసం 2, 3 సార్లు రతిలో పాల్గొంటాం. కానీ నా భార్య ఇంత వరకు గర్భవతి కాలేదు. బహిస్టు అయిన 14, 15రోజులలో కూడా మేం సెక్సులో పాల్గొంటున్నాం. (రోజుకి 4, 5సార్లు). అయితే పెళ్లి కాక ముందు నేను ఒక సారి వీర్య పరీక్ష చేయించుకున్నాను. వీర్యకణాల సంఖ్య 6(ఆరు) మిలియన్లు మాత్రమే ఉన్నాయి. సంతానం కావడానికి కనీసం 40 మిలియన్ల వీర్యకణాలు కావలసి ఉంటుందని చదివాను. దీనివల్ల నాకు సంతానం కలిగే అదృష్టం లేనట్టేనా?
నిజానికి ఫలదీకరణం జరగడానికి ఒకే ఒక్క వీర్యకణం సరిపోతుంది. కదా? మరి నాకున్నవి ఆరు మిలియన్ల వీర్యకణాలు. కావున సంతానం కలగడానికి అవకాశం ఉన్నట్టే కదా. దయచేసి వివరించండి. వీర్యకణాలు పెరగడానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవలెనో దయచేసి తెలపండి. జంతు కాలేయం. ఆకుకూరలు తింటే వీర్యకణాలు వృద్ధి అయ్యే అవకాశం ఉందని చదివాను. తక్కువ ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు. అందువల్ల నా భార్యకు పరీక్షలు చేయించడం లేదు.
-ఎ.బి.రావు, కరీంనగర్‌

డాక్టర్‌ సమాధానం : మీరు రోజుకి ఒకసారి, లేదా రెండు రోజులకొకసారి రతిలో పాల్గొనండి చాలు! ఇంకే లోపాలూ లేకపోతే త్వరలో గర్భం వస్తుంది. జననాంగాలకు కొబ్బరినూనె, వేజ్‌లిన్‌, జెల్లీలు మొదలైనవి ఏవీ పూయకండి. ఓ 3నెలలు ఇలా ప్రయత్నించి చూడండి. గర్భం రాకపోతే ఇద్దరూ డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోండి.
మీ వీర్యంలో కణాల సంఖ్య 6 మిలియన్లే ఉన్నాయన్నారు.
3-4 రోజులు (రతి చేయకుండా, స్థలించకుండా ఉన్నాకనే పరీక్ష చేయించారా? అలా లేకపోతే ఈ కౌంటు సరైన కౌంటు కాదు. 3 రోజుల విరామం ఇచ్చి మళ్ళీ పరీక్ష చేయించండి. ఆ వీర్యంలో సుమారు 30 మిలియన్లు కౌంటు, 50-60% యాక్టివ్‌ మోర్టాలిటీ (లేదా 30-40% స్త్రతీaసవ ×V మోర్టాలిటీ ఉండి జూబర షవశ్రీశ్రీర 5 లేక అంతకన్నా లోపు ఉంటే… టతీబష్‌శీరవ పాజిటివ్‌ అయితే… వీర్యం రాశి 1.0 మిలియన్‌ అంతకన్నా ఎక్కువ ఉంటే ..మీ వైపు దాదాపు బాగున్నట్టే!
గర్భం వచ్చేది ఒక్క వీర్యకణమే అయినా అనేక మిలియన్ల కణాలున్నప్పుడు మాత్రమే అందులో ఒక్కటి సక్సెస్‌ కాగల్గుతుంది. 10-20 మిలియన్ల కన్నా తక్కువ కణాలుంటే గర్భం రావటం చాలా ఆలస్యమవడానికి అవకాశాలెక్కువ. దాంతో పాటు మోర్టాలిటీ కూడా తక్కువైతే ఛాన్సులు ఇంకా తక్కువని గమనించండి.
లోపం మీ దగ్గరే ఉందనే నిర్ణయానికి దూకెయ్యద్దు. మీకు తెలిసినది చాలా తక్కువ! డాక్టర్ని కలవండి. కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
(గమనిక : ఈ ప్రశ్నకు సమాధానం సెక్సాలజిస్ట్‌ ఇచ్చినది. దీని ఆధారంగా ఇతరులు ఫాలో అవ్వాలన్న నియమం లేదు. సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడమే కరెక్ట్‌, ఈ ప్రశ్న, సమాధానం అనేవి ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దయచేసి గమనించగలరు.)

kiss2

Tomorrow Another Question

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*