పారిజాతం చూశారా? ఇక్కడ చెట్టే దైవం (వీడియో)

Share

లక్నో : హిందువులు అధికంగా ఉండే మన దేశంలో ఏ చెట్టయినా, ఏ పుట్టయినా, ఏ రాయి అయినా, ఇంకే వస్తువైనా క్షణాల్లో దేవుడిగా మారిపోవచ్చు. ఇక్కడ ఏదైనా సాధ్యమే. ప్రజల నమ్మకాలు అంత తీవ్రంగా వుంటాయి మరి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలోని అత్యంత పురాతనమైన బావోబాబ్‌ చెట్టు సడన్‌గా హిందూ భక్తులకు ఇలవేల్పుగా మారిపోయింది. హిందూ పురాణాల్లో పారిజాత వృక్షం గురించి వినేవుంటారు. ఈ పురాతన చెట్టును స్థానికులు పారిజాత వృక్షంగానే పరిగణిస్తున్నారు. దేవతలు, రాక్షసులు సముద్రం చిలికినప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షం ఇదేనని వారి నమ్మకం. మహాభారతంలో అర్జునుడు దేవతల రాజైన ఇంద్రుడి సంరక్షణ నుంచి భూమికి తీసుకువచ్చిన పారిజాత వృక్షం ఇదేనని స్థానికులు గాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రజలు రోజూ ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తున్నారు. దేవాలయాల్లో రావిచెట్టు చుట్టూ భక్తులు తిరుగుతుంటారు. కానీ దానికన్నా వేల రెట్లు శక్తివంతమైన చెట్టు ఇదేనని స్థానికులు చెపుతున్నారు. ఈ వీడియో ఓసారి చూస్తే భక్తి ఏ స్థాయిలో వుంటుందో తెలుస్తుంది.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*