అంగారకుడిపై ఊహించని ఖనిజం

Share

కనిపెట్టిన క్యూరియాసిటీ రోవర్‌
వాషింగ్టన్‌: అంగారక గ్రహంపై ఊహించని విధంగా కొత్త ఖనిజాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. అరుణగ్రహంపై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ గ్రహంపై సేకరించిన రాయి నమూనాలో ఈ ఖనిజం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడిపైన 2012 సంవత్సరం నుంచి కారు సైజులో ఉండే క్యూరియాసిటీ అనే సైన్స్‌ లాబరేటరీ రోబోటిక్‌ రోవర్‌ గ్రహంపై పలు నమూనాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సేకరించిన రాయి నమూనాను ఎక్స్‌-రే డిఫ్రాక్షన్‌ పరికరం ద్వారా పరిశీలిస్తుండగా అందులో కొంత ట్రిడైమైట్‌ పేరుతో పిలిచే సిలికా ఖనిజాన్ని గుర్తించారు. ఈ ఖనిజం లభించడంతో అరుణగ్రహంపై అగ్నిపర్వతాలకు సంబంధించిన చరిత్ర, ఆనవాళ్లు ఉన్నాయోమోనని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ మినరల్‌ సాధారణంగా భూమిపై అగ్నిపర్వతం (సిలిసిక్‌ వాల్కానిజం) పేలినప్పుడు అధిక ఉష్ణోగ్రతలు వెలువడిన సమయంలో ఏర్పడుతుంది.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*