భర్తే తన సోదరుడైతే…? ఏడేళ్ళుగా అన్నతో కాపురం!

Live-in
Live-in
Share
Live-in
Live-in

రియో డిజినీరో : వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ళుగా సుఖ సంసారం చేశారు. వారి మధ్య ఎంతో ఆప్యాయతలున్నాయి. వారి ప్రేమకు చిహ్నంగా ఆరేళ్ళపాప కూడా వుంది. ఇంతలో సడన్‌గా తెలిసింది… తన భర్తే తన సొంత అన్నయ్య అని! ఇంకేమైనా వుందా? రోజంతా రోదించి రోదించి నీరసించింది. ఈ విషయం తెల్సిన ఆమె భర్త కూడా ఏడ్చాడు. ఏం చేయాలో తెలియక ఇప్పటికీ ఏడుస్తూనే వున్నారు. ఒక అత్యాచారం కన్నా…ఒక హత్య కన్నా దారుణమైన విషయంగా వారిద్దరూ భావిస్తున్నారు. నిజమే మరి! బ్రెజిల్‌లో సంభవించిన అతి విషాదకరమైన ఉదంతమిది! ఇంతకీ జరిగిందేమిటంటే, ఆడ్రియానా, లియాండ్రోలు ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు. చిన్నతనంలోనే వారు తమ తల్లి నుంచి విడిపోయి, వేర్వేరుగా పెరిగారు. అప్పటి నుంచి వారు వేర్వేరుగానే తమ తల్లి గురించి వెతుకుతూనే వున్నారు. యవ్వనం వచ్చాక వీరిద్దరూ ఓ చోట కలిశారు. తల్లి కోసం వెతుకుతున్నట్లు తెలుసుకున్నారు. తల్లిపేరు మారియా అని తెలుసుకున్నారు. కానీ తమ తల్లుల పేర్లు మారియా ఒక్కటే కావడం యాదృచ్ఛికమనుకున్నారే తప్ప ఇద్దరి తల్లీ ఒక్కరే, ఆమే మారియా అని వారు ఆనాడు అనుకోలేదు. వారి మధ్య పరిచయం పెరిగి, అనుబంధం ఏర్పడింది. ప్రేమతో మొదలై పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇద్దరం అన్నాచెల్లెళ్లమన్న సంగతి వారికి తెలియదు. ఆనందంగా కాపురం చేశారు. ఓ పాప పుట్టింది. ట్విస్ట్‌ ఇక్కడే వుంది! అప్పటికే వారిద్దరూ తమ తల్లి కోసం వేర్వేరుగా వెతుకుతూనే వున్నారు కదా! ఆడ్రియానా ఏం చేసిందంటే?…తన తల్లి కోసం వెతుకలాట తీవ్రతరం చేసింది. బ్రెజిలియన్‌ రేడియో స్టేషన్‌ రేడియో గ్లోబోను సంప్రదించింది. విడిపోయిన వారి కోసం ఈ రేడియో గాలింపు చేస్తుంది. వారిని ఒక్కటి చేస్తుంది. అందులో భాగంగా అందరి కృషి ఫలించింది. ఆడ్రియానా తల్లి దొరికింది. చివరకు తన తల్లి కూడా దొరికందని లియాండ్రో చెప్పాడు. తీరాచూస్తే…ఇద్దరి తల్లీ ఒక్కరే! అంతే…వారి గుండెపగిలింది. ఇద్దరు అన్నాచెల్లెళ్ళని తెలిసింది వారికి! ఏం చేయాలో తోచలేదు. కానీ చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమంటే, ఇద్దరూ కలిసే ఈ జీవితాన్ని కొనసాగించాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. వారి కాపురం అలాగే కొనసాగుతోంది! విధి అలా చేసిందే తప్ప ఇది మా తప్పు కాదని వారు తేల్చేశారు! అదన్నమాట!

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*