పాము కాటేసినా డ్యాన్స్‌ చేస్తూ చనిపోయింది! (Video)

Snake Dancer
Snake Dancer
Share
Snake Dancer
Snake Dancer

జావా : ఇండోనేషియాలో వెస్ట్‌ జావాలోని కరవాంగ్‌ అనే గ్రామంలో ఇర్మా బూలే అనే ఓ గొప్ప డ్యాన్సర్‌ వుంది. ఆమె పాములతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంది. ఆమె డ్యాన్స్‌ అంటే చాలామందికి ఇష్టం. 29 ఏళ్ళ ఈ డ్యాన్సర్‌కు ఈ ప్రాంతంలో మంచి గిరాకీ కూడా వుంది. చాలామంది ఆమె నాట్యాన్ని చూడటానికి వస్తూ వుంటారు. అలాగే తమ ఊళ్ళకు తీసుకువెళ్లి ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తూవుంటారు. ఆమె పాములతో కలిసి డ్యాన్స్‌ చేయడమే ఆమె స్పెషాలిటీ. అయితే విషం తీసిన పాములను మాత్రమే ఆమె ఉపయోగిస్తుంటుంది. ఇర్మా బూలే డ్యాన్స్‌ గ్రూపులో ఈ మధ్యనే ఓ కొత్త పాము వచ్చి చేరింది. అదొక కింగ్‌ కోబ్రా. దాని విషాన్ని పూర్తిగా తీసేశారని ఆమె అనుకుంది. కానీ ఆ కింగ్‌ కోబ్రా పూర్తిగా విషపూరిత జంతువుగానే వుంది. ఈ విషయం ఆ డ్యాన్స్‌ ట్రూపులో ఎవ్వరికీ తెలియదు. కరవాంగ్‌ గ్రామంలో యథావిధిగా ఇర్మా బూలే డ్యాన్స్‌ మొదలైంది. స్టేజిపైకి పాములను వదిలిపెట్టారు. పాములతో కలిసి ఆమె డ్యాన్స్‌ చేయడం ఆరంభించింది. ఇంతలో విషం తీయని కింగ్‌కోబ్రా సరసరామంటూ వచ్చి ఆమెను కాటేసింది. అది నిజమైన పాముకాటేనని ఆ క్షణంలో ఇర్మాకు అర్థమైంది. కానీ తానే తప్పుగా భావించి వుంటానని అనుకొని డ్యాన్స్‌ కొనసాగించింది. అలా 45 నిమిషాలపాటు డ్యాన్స్‌ కొనసాగించిన ఇర్మా కాసేపటికి కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆ గ్రామస్థులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె పాముకాటుకు గురై చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటన యిది. ఎన్నో ఏళ్ళుగా ఇర్మా బూలే ఇండోనేషియా పాప్‌స్టార్‌గా పేరు గడించింది. పెద్దపెద్ద పైతాన్‌లతో సైతం ఆమె డ్యాన్స్‌ చేసింది. ఇదొక కొత్త డ్యాన్స్‌. దాని పేరు రియాంటి. ఈ నృత్యంలో పాములతో కలిసి డ్యాన్స్‌ చేయాల్సివుంటుంది. అయితే విషం తీయని కింగ్‌కోబ్రాను ఆమె ట్రూప్‌లో ఎలా చేర్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://youtu.be/w8N44Y0wIps

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*