చికెన్‌ తింటే కేన్సర్‌ వస్తుందా?

Share

chikన్యూఢిల్లీ : చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్‌ వ్యాధికి కారకమయ్యే ‘ఆర్సనిక్‌’ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది. ఈ విషయాన్ని ఎఫ్‌డిఎ (అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో చికెన్‌ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్‌ తింటారు. ఆర్సనిక్‌ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్‌ మరింత శక్తివంతమవుతుంది. చికెన్‌లో వుండే ఈ ఆర్సనిక్‌ రసాయనం వల్ల కేన్సర్‌ వస్తుందని 2006లోనే ఐఎటిపి ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఎఫ్‌డిఎ దీన్ని అంగీకరించలేదు. ఎన్నో ఏళ్ళుగా దీనిపై తర్జనభర్జనలు జరుగుతూవచ్చాయి. చివరకు ఎఫ్‌డిఎ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. కోళ్ళు త్వరగా పెరగడానికి, మంచి మాంసం (కండ) రావడానికి గాను వాటికి కొన్ని రకాల మందులు ఇస్తారు. అందులో ప్రధానమైన డ్రగ్‌ ‘రోగ్జార్‌సోన్‌’. ఈ ఇంజక్షన్ల వల్ల కోడి ఏపుగా పెరుగుతుంది. మాంసం దిగుబడి బాగావుంటుంది. అంతవరకు బాగానే వుంది. కానీ దాంతోపాటు కోడిలో వుండే ఆర్సనిక్‌ అనే రసాయనం ఈ మందులకు మరింత శక్తివంతమవుతుంది. దీంతో కేన్సర్‌ కలిగించే ఈ రసాయన కణాలు కూడా పెరుగుతాయి. తద్వారా చికెన్‌ తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలను ఇవి తినేస్తాయి. అదన్నమాట! అందుకే చికెన్‌ తినేటప్పుడు కాస్త ఆలోచించి తినండి!

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*