ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ త్రీడీ ప్రింటర్‌!

Share
Olo 3D printer
Olo 3D printer

ముంబయి : ప్రపంచంలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ త్రీడీ ప్రింటర్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. దీని పేరు ‘ఓలో’. గతం కన్నా స్పీడ్‌ యాక్సెస్‌తో త్రీడీ ప్రింటింగ్‌ చేసే విప్లవాత్మక పరికరంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓలో టెక్నాలజీ చాలా సింపుల్‌, అద్భుతమైనది.ఈ ప్రింటర్‌ చాలా చిన్నది కూడా. ఈ ఓలో త్రీడీ ప్రింటర్‌లో కేవలం 7 ప్లాస్టిక్‌ విభాగాలు మాత్రమే వుంటాయి. ఒక చిప్‌, ఒక మోటారు వుంటుంది. డేలైట్‌ రెసిన్స్‌ అని పిలిచే సరికొత్త మెటీరియల్స్‌ను దీంతో పరిచయం చేశారు. దీని బరువు కేవలం ఒక పౌను మాత్రమే. అతిపెద్ద ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌, గేలక్సీ ఎ7తోపాటు దాదాపు అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్లకూ ఈ ఓలో త్రీడీ ప్రింటింగ్‌ గాడ్జెట్‌ పనిచేస్తుంది.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*