ఎండతో ఛార్జీంగ్ అవుతుంది!

Share

హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందటే.. వివరీతమైన ఎండలతో ఏ పని చేయాలన్న చిరాకు వస్తుంది. కానీ ఎండతో కుర్రాకారుకి ఓ మంచి లాభం కూడా ఉందని మీకు తెలుసా.. ప్రస్తుతం నడుస్తున్న స్మార్ట్ ఫోన్ల జమానాలో ఫోన్ ఛార్జీంగ్ పెట్టుకోవడం పెద్ద సమస్య. మరీ ఎండతోనే ఫోన్ ఛార్జ్ అయిపోతే.. ఎంత బాగుంటుదో. అలాంటి ఆలోచనే ఈ వివో ఎక్స్‌ప్లే 5 స్మార్ట్ ఫోన్. వివో కంపెనీ తయారు చేసిన ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌, సౌరవిద్యుత్తుతో ఛార్జింగ్‌ ప్రత్యేకతలు. ఎంత హైఎండ్‌ ఫోన్‌లైనా ఇప్పటివరకు 4జీబీ ర్యామ్‌నే అత్యధికం. ఆరంగుళాల తెర, 16, 8 మెగా పిక్సళ్ల కెమేరాలు వివోలో అదనపు హంగులు. మార్చి1 కి అందుబాటులోకి రానుంది. వేళ్లను వేగంగా కదిలించే యువత ఈ ఫోన్‌తో ఇక దూసుకెళ్లొచ్చు. లీఎకో, శామ్‌సంగ్‌లు సైతం ఈ తరహా ఫీచర్లతో రానున్నాయని వార్తలొస్తున్నాయి.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*