కొట్టుకుంటున్న పసిహృదయం! (వీడియో)

Share

బీజింగ్‌ : అప్పుడే పుట్టిన ఓ పసివాడి గుండె కొట్టుకుంటున్న వీడియో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. శరీరం నుంచి బయటకు వచ్చేసినట్లుగా కన్పించే ఆ గుండె లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ అంటూ కొట్టుకుంటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో గల జియాన్‌యాంగ్‌లో ఆ పసివాడు జన్మించాడు. అయితే అతని గుండె సన్నని చర్మం పొర కింది దాకా వచ్చేసింది. అలా ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. పైగా గుండె కొట్టుకుంటుంటే చర్మం కూడా పైకిలేస్తున్నది. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో తెలియక డాక్టర్లు మల్లగుల్లాలవుతున్నారు. ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో ఎక్టోపియా కార్డిస్‌ అని పిలుస్తారు. ఇదొక అరుదైన వ్యాధి. బిడ్డ రకరకాల లోపాలతో జన్మిస్తే ఇలా గుండె శరీరం బయటకు వచ్చి కొట్టుకుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధి 10 లక్షల మంది నవజాత శిశువుల్లో ఏడుగురికి మాత్రమే వుంటుంది. 1975లో ఫిలడెల్ఫియాలో ఇలాగే జరిగితే అలాంటి బాలుడిని డాక్టర్లు కాపాడారు. కానీ వైద్య విజ్ఞానం పెరిగేకొద్దీ గందరగోళం కూడా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ బిడ్డను కాపాడలేమని డాక్టర్లు చేతులెత్తేయడం బాధాకరం. సాధారణంగా పిల్లలు ఇలా పుడితే మూడు రోజుల్లోపే మరణించడానికి అవకాశం వుంటుంది.

https://youtu.be/iGlaZWqtg7I

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*